MLA RAJU: పేదల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:11 AM
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు రూ.18.53లక్షల విలువచేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు.
మడకశిరటౌన, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు రూ.18.53లక్షల విలువచేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తూతూమంత్రంగా అరకొర సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రచారం మాత్రం జగన ఊదరగొట్టారని మండిపడ్డారు. ఓ వైపు పేదల ప్రభుత్వం అని చెబుతూనే వారికి అందాల్సిన సంక్షేమ పథకాల మాటున దోపిడీకి తెరతీసిన ఘనుడు జగనమోహనరెడ్డికాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు, డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, కన్వీనర్లు తిప్పేస్వామి, నాగరాజు, లక్ష్మీనరసప్ప పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి సమష్టి కృషి: గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బసవనపల్లి, నరసాంబుది, గౌడనహళ్లి గ్రామ పంచాయతీల పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. పంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పంచాయతీల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపడితే అభివృద్ధి చెందుతాయన్న విషయాలపై అభిప్రాయాలు తెలుసుకొన్నారు. దేశానికి గ్రామ పంచాయతీలే పట్టుకొమ్మలని, వాటి అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ అభ్యున్నతి, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య దూరం ఉందా అన్న అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా నేరుగా వచ్చి కలిసి తెలపాలని సూచించారు. మండల కన్వీనర్లు నాగరాజు, తిప్పేస్వామి, కృష్ణమూర్తి, మాజీ సర్పంచి చంద్రప్ప పాల్గొన్నారు.