CANAL : హంద్రీనీవా కాలువకు మళ్లీ గండి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:57 PM
హంద్రీనీవా కాలువకు మళ్లీ గండిపడింది. మండల కేంద్రం సమీపంలోని నక్కలగుట్ట కాలనీ వద్ద గురువారం ఉదయం మడకశిర ఉప కాలువకు గండిపడింది. దీంతో చాకర్లపల్లి కుంటకు, అక్కడి నుంచి చల్లాపల్లి చెరువు నిండి నాగలూరు చెరువుకు నీరు చేరింది.

సోమందేపల్లి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువకు మళ్లీ గండిపడింది. మండల కేంద్రం సమీపంలోని నక్కలగుట్ట కాలనీ వద్ద గురువారం ఉదయం మడకశిర ఉప కాలువకు గండిపడింది. దీంతో చాకర్లపల్లి కుంటకు, అక్కడి నుంచి చల్లాపల్లి చెరువు నిండి నాగలూరు చెరువుకు నీరు చేరింది. గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద నీటి పంపింగ్‌ను ఆపేశారు. కాలువలో నీటి ప్రవాహం తగ్గిపోయాక గండి పూడ్చే పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 1న 47వ కి.మీ, వద్ద కాలువకు గండిపడి నీరు పొలాలను ముంచెత్తింది. అధికారులు ఆగమేఘాలపై అప్పట్లో గండిని పూడ్చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ గండిపడడం అనుమానాలకు తావిస్తోంది. కాలువగట్లు తెగుతున్నాయా, తెగ్గొడుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ పాలనలో కాలువ మరమ్మతులు, నిర్వహణను గాలికొదిలేయడంతో పూడిపోయి, చెట్లు పెరిగిపోయి గండ్లు పడుతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.