CPM: హంద్రీనీవాను వెడల్పు చేయాలి
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:47 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా హంద్రీనీవాను పదివేల క్యూసెక్కుల నీరు పారే విధంగా వెడల్పు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు.

గుంతకల్లు, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా హంద్రీనీవాను పదివేల క్యూసెక్కుల నీరు పారే విధంగా వెడల్పు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని జి. కొట్టాల గ్రామం వద్ద హంద్రీనీవాలో జరుగుతున్న వెడల్పు పనులను సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ.. సీఎం ప్రకటన మేరకు హంద్రీనీవాను పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేయాలని, అంతవరకూ లైనింగ్ పనులను చేయరాదని డిమాండ్ చేశారు. రాగులపాడు వద్ద నుంచి వజ్రకరూరు, గుంతకల్లు, పామిడి మండలాల చెరువులకు నీరిచ్చే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పండ్ల తోటల రైతులకు ప్రభుత్వం పరిహారాలను ఇవ్వాన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి. శ్రీనివాసులు, నాయకులు మారుతీ ప్రసాద్, కసాపురం రమేశ తదితరులు పాల్గొన్నారు.