Pyyavula Keshav: త్వరలోనే ఏపీకి మరిన్ని పరిశ్రమలు: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:37 AM
చంద్రబాబు బ్రాండ్ చూసే గూగుల్ సంస్థ ఏపీకి వచ్చిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మరిన్ని పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు.
అనంతపురం, నవంబర్ 11: యువత భవిత కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) అన్నారు. సిరికల్చర్ కార్యాలయ ప్రాంగణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పయ్యావుల మాట్లాడుతూ.. ఈనెల 13, 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే వ్యాపార భాగస్వామ్య సదస్సుకు 51 దేశాల నుంచి వస్తున్నారని.. ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను అధిగమించి చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. గూగుల్ సంస్థ అమెరికా తర్వాత ఏపీలో అతిపెద్ద పెట్టుబడి పెట్టిందని చెప్పుకొచ్చారు. కేవలం చంద్రబాబు బ్రాండ్‌తోనే ఇక్కడికి వచ్చినట్లు మంత్రి తెలిపారు.
గతంలో మైక్రోసాఫ్ట్ తెస్తే యువతకు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. తాజాగా ఏఐ వచ్చాక గూగుల్ డేటా సెంటర్ వస్తోందన్నారు. గూగుల్‌తో పాటు ఏఐని వాడుకునే ఇతర పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయని అన్నారు. ఇది మూడుతరాల వారిని అదుకుంటుందని తెలిపారు. జగన్ చెప్పినట్లు నాలుగు రేకులు వేసే షెడ్ కాదని వ్యాఖ్యలు చేశారు. విశాఖ ప్రపంచంలోనే పెద్ద డేటా సెంటర్ కాబోతోందన్నారు.
భవిష్యత్‌తరాలు ఎలా బాగుపడతాయని జగన్ ఆలోచిస్తే బాగుంటుందని హితవుపలికారు. హంద్రీనీవాలో అన్ని పంపులు పని చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. వీలైనన్ని ఎక్కువ నీరు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. రైతులు బాగుంటే.. పరిశ్రమలు వస్తే... రాష్ట్ర ఎకానమీ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామన్నారు. రేపు విశాఖలో అద్భుతాలు జరగబోతున్నాయన్నారు. గతంలో కార్పోరేట్ సంస్థలు ఇక్కడికి వచ్చేందుకు భయపడ్డాయన్నారు. కానీ నేడు పెట్టుబడులు పెట్టండి... ఉద్యోగాలు ఇవ్వండని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అడుగుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం
సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు.. మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేష్
Read Latest AP News And Telugu News