MINISTER SAVITHA: మత సామరస్యానికి ప్రతీక పెనుకొండ
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:04 AM
మతసామరస్యానికి ప్రతీక పెనుకొండ అని హిందూ, ముస్లిం, జైన మతస్థులకు నిలయంగా వెలుగొందుతోందని మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక పశ్చాపార్వ్శనాథస్వామి జైన ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

పెనుకొండ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మతసామరస్యానికి ప్రతీక పెనుకొండ అని హిందూ, ముస్లిం, జైన మతస్థులకు నిలయంగా వెలుగొందుతోందని మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక పశ్చాపార్వ్శనాథస్వామి జైన ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు జీనచంద్రయ్య, బ్రహ్మానంద, అజితప్రసాద్, ఆదిదినేష్ ఆధ్వర్యంలో స్వామివారికి 108 కలశాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథులుగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రకీర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పెనుకొండ మతసామరస్యానికి ప్రతీక అన్నారు. ముస్లింలకు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిచెందిన బాబయ్యదర్గా హిందువులకు సంబంధించిన 365దేవాలయాలతోపాటు భారతదేశంలోనే నాలుగు జైన పీఠాల్లో ఒకటి పెనుకొండలో ఉండటం గర్వకారణమన్నారు. ఆలయ కమిటీ సభ్యులు చంద్రకీర్తి, రాజన, పద్మ,ప్రభ, సురే్‌షకుమార్, సుందరరామయ్య, పార్శ్వనాథ్ వేదలవేణి హాజరయ్యారు.