Tadipatri Tension: పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. టెన్షన్ టెన్షన్
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:15 AM
Tadipatri Tension: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరతానంటూ రోడ్డుపైనే కేతిరెడ్డి పెద్దారెడ్డి బైఠాయించారు. పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

అనంతపురం, జులై 18: తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఈరోజు (శుక్రవారం) వైసీపీ ‘చంద్రబాబు రీకాలింగ్’ మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని (Former MLA Ketireddy Peddareddy) పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు వీలు లేదని, తాడిపత్రిలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున తిమ్మంపల్లి నుంచి వెళ్లేందుకు వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు సమావేశానికి హాజరుకావొచ్చని పోలీసులు తెలిపారు. అలాగే కేతిరెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే స్వగ్రామం తిమ్మంపల్లిలో హైటెన్షన్ నెలకొంది.
హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు అనుమతించరని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరతానంటూ రోడ్డుపైనే మాజీ ఎమ్మెల్యే బైఠాయించారు. పోలీసుల తీరుపై పెద్దా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈక్రమంలో వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా తాడిపత్రిలోనూ అటు తిమ్మంపల్లిలోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఇవి కూడా చదవండి..
నౌకాదళంలోకి స్వదేశీ ‘ఐఎన్‌ఎస్ నిస్తార్’
ఘోర ప్రమాదం.. లారీని వెనక నుంచి ఢీకొన్న కారు
Read latest AP News And Telugu News