Share News

Tension In Tadipatri: జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. తాడపత్రిలో ఏం జరుగుతోంది

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:06 AM

Tension In Tadipatri: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిగా పరిస్థితి మారింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి జిల్లాకు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు జేసీ ఇంటికి చేరుకుంటున్నారు.

Tension In Tadipatri: జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. తాడపత్రిలో ఏం జరుగుతోంది
Tension In Tadipatri

అనంతపురం, జూన్ 14: జిల్లాలోని తాడిపత్రిలో (Tadipatri) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Former MLA Kethireddy Pedda Reddy) తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఇంటికి చేరుకున్నారు. పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. జేసీ నివాసంతో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.


మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరగా.. తిమ్మంపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. తనకు కోర్టు పర్మిషన్లు ఉన్నా ఎందుకు పంపడం లేదని పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వివాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. టీడీపీ నేత జేసీ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు పెద్దారెడ్డి ఎట్టిపరిస్థితుల్లోనూ తాడిపత్రికి రావడానికి వీల్లేదని జేసీ అనుచరులు, టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. గతంలో వైసీపీ హయాంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

యోగాంధ్రను విజయవంతం చేయండి.. రఘురామ పిలుపు

లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 01:30 PM