SANKRANThI : ఘనంగా సంక్రాంతి వేడుకలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:28 AM
జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా సాగాయి. మంగళ, బుధవారాల్లో ప్రజలు పెద్దఎత్తున సంక్రాంతి, కనుమ వేడుకలను జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముంగిట రంగురంగుల రంగవల్లులను వేసి, గొబ్బెమ్మల ను ఏర్పాటు చేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించారు. ఆలయాల్లోనూ మకర సంక్రమణ పూజలు, కనుమనాడు గోపూజ నిర్వహించారు. టీటీడీ హిం దూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం తలుపూరు లోని చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద బుధవారం సాయంత్రం గోపూజ చేశారు.

అనంతపురం కల్చరల్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా సాగాయి. మంగళ, బుధవారాల్లో ప్రజలు పెద్దఎత్తున సంక్రాంతి, కనుమ వేడుకలను జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముంగిట రంగురంగుల రంగవల్లులను వేసి, గొబ్బెమ్మల ను ఏర్పాటు చేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించారు. ఆలయాల్లోనూ మకర సంక్రమణ పూజలు, కనుమనాడు గోపూజ నిర్వహించారు. టీటీడీ హిం దూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం తలుపూరు లోని చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద బుధవారం సాయంత్రం గోపూజ చేశారు. అలాగే కనుమ సందర్భంగా సాగిన వనవిహారాలు, విందు, వినోదాలతో నగర శివార్లలోని పా ర్కులు కిక్కిరిశాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా నగరవాసులు శిల్పారామంలో ఉల్లాసం గా గడిపారు. బంధు మిత్రులతో కలిసి ఆడుతూ, పాడుతూ చిన్నారులు కేరింతలతో గడిపారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం కాలనీ, గణేనాయక్ కాలనీ, మహదేవనగర్‌లలో మహి ళలకు ముగ్గులపోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. అలాగే పలుప్రాంతాల్లో ఆలయాలలో ప్రత్యేక పూజలు, రథోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో తపోవనంలోని శివశక్తి దేవాలయం వద్ద సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యే కంగా అలంకరించిన రథంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంక టేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ఉంచి నగరోత్సవం నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....