MLA SUNITHA: అధైర్యపడకండి.. అండగా ఉంటాం
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:55 PM
అధైర్యపడకండి అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చా రు. మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నారాయణస్వామి కుమారై రేణుక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.

అనంతపురంరూరల్,ఏప్రిల్16(ఆంధ్రజ్యోతి): అధైర్యపడకండి అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చా రు. మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నారాయణస్వామి కుమారై రేణుక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మండల నాయకులతో కలసి ఎమ్మెల్యే బాధిత కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. రేణుక మృతిపై కుటుంబ సభ్యులతో మాట్లాడా రు. కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం అదే గ్రామంలో ప్రమాదానికి గురై చికిత్స అనంతరం కోలుకున్న దివ్యాంగుడు ఎర్రిస్వామిరెడ్డిపరామర్శించారు. బాధితుడికి ఆర్థిక సాయం చేశారు. మండల కన్వీనర్ జింకాసూర్యనారాయణ, క్లస్టర్ ఇనచార్జ్ రాగేమురళీమోహన, నాయకులు శంకర్‌రెడ్డి, కొండారెడ్డి, అజయ్‌రెడ్డి, నాగేంద్ర, మల్లయ్య, క్రిష్ట, రామ్మోహనరెడ్డి పాల్గొన్నారు.
రక్తదానం.. ఆరోగ్యానికి శ్రేయస్కరం
ఆత్మకూరు: రక్తదానం చేయడం యువతకు శ్రేయస్కరమణి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని సనప గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదానం చేస్తున్న యువతను పలకరించి అభినందించారు. టీడీపీ మండల ఇనచార్జి ధర్మవరపు బాలాజి, కన్వీనర్ శ్రీనివాసులు, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం, నారాయణస్వామి, శశాంక్ చౌదరి, రఘునాధ్‌రెడ్డి, డిష్ నాగరాజు పాల్గొన్నారు.