Share News

MINISTER SAVITHA: అధైర్యపడకండి.. అండగా ఉంటా

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:19 AM

: అధైర్యపడకండి తెలుగుదేశం పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మహ్మద్‌ఖాన కుటుంబానికి మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పెనుకొండ మండలం నాగలూరు గ్రామ మాజీ సర్పంచ మహ్మద్‌ ఖాన అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు.

MINISTER SAVITHA: అధైర్యపడకండి.. అండగా ఉంటా
Minister Savita visiting Mohammad Khan's family

పెనుకొండ రూర ల్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): అధైర్యపడకండి తెలుగుదేశం పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మహ్మద్‌ఖాన కుటుంబానికి మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పెనుకొండ మండలం నాగలూరు గ్రామ మాజీ సర్పంచ మహ్మద్‌ ఖాన అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి శుక్రవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి అధైర్యపడకండి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట మాజీ జడ్పీటీసీ నారాయణస్వామి, మండల కన్వీనర్‌ సిద్దయ్య, ఈశ్వరప్రసాద్‌ పాల్గొన్నారు.

రోడ్డు విస్తరణ పనులపై స్పందించిన మంత్రి

గోరంట్ల: పట్టణంలోని బస్టాండ్‌ కూడలినుంచి రావికుంట చెరువుకట్టవరకు ఆగిన బైపా్‌సరోడ్డు విస్తర్ణ పనులపై మంత్రిసవిత స్పందిస్తూ అధికారులు చర్యలు చేపట్టాలని శుక్రవారం ఆదేశించారు. రహదారిని గోరంట్ల పంచాయతీ డబుల్‌రోడ్డుగా అభివృద్ది చేయడానికి గతంలో చర్యలు చేపట్టింది. భవన నిర్మాణాల తొలగింపు విషయంలో వివాద ంచోటు చేసుకోవడంతో కొన్నేళ్లుగా పనులు నిలిచిపోయాయి. సర్పంచ సరోజ భర్త టీడీపీ నాయకుడు నాగేనాయక్‌, మండలకన్వీనర్‌ సోముశేఖర్‌ మంత్రితో చర్చించారు. మంత్రి ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటరామిరెడ్డి, ఏఈ శ్రీనివాసులును పిలిపించి మాట్లాడారు. రెవెన్యూ సబ్‌డివిజన మేరకు 60 అడుగుల బైపా్‌సరోడ్డు ఉన్నట్లు రికార్డులో తేలడంతో, వెంటనే సంబధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేసి, ఖాళీ చేయించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.


బాధిత కుటుంబానికి పరిహారం అందజేత

పెనుకొండ టౌన, : విద్యుతషాక్‌కు గురై 2024లో మృతిచెందిన అలివేలమ్మ కుటుంబానికి రూ.5లక్షలు మంత్రి సవిత మంజూరు పత్రాన్ని అందజేశారు. శుక్రవారం మంత్రి నివాసంలో ట్రాన్సకో ఎస్‌ఈ సురేంద్రబాబు చేతులమీదుగా బాధితులకు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ 2024అక్టోబర్‌లో అలివేలమ్మ ప్రమాదవశాత్తు విద్యుతషాక్‌కు గురై మృతిచెందిందని ఆమె కుటుంబానికి అండగా ఉండాలని చెక్కును అందజేసినట్లు తెలిపారు.

ఉమ్మడి జిల్లాకు మరిన్ని పరిశ్రమలు

ఉమ్మడి అనంత జిల్లాలో మరిన్ని పరిశ్రమలు రానున్నాయని ఏపీఐఐసీ చైర్మన మద్దెన రామరాజు పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి సవిత ఇంటికి వచ్చిన ఆయనకు పూలహారాలతో ఘనంగా స్వాగతించారు. మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్నత చదువులు చదివారని వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు.

Updated Date - Apr 05 , 2025 | 12:19 AM