MLA RAJU : కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:06 AM
ప్రజాసంక్షేమం, రాషా్ట్రభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. సొమవారం మండలంలోని గౌడనహళ్ళి, భక్తరహళ్ళి, జిల్లేడగుంట గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
మడకశిర రూరల్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రజాసంక్షేమం, రాషా్ట్రభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. సొమవారం మండలంలోని గౌడనహళ్ళి, భక్తరహళ్ళి, జిల్లేడగుంట గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన మాట ప్రకారం భర్త మరణించిన వెంటనే భార్యకు పింఛన అందిస్తున్నట్లు తెలలిపపారు. దీంతో ఆ కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి,మండల కన్వీనర్ నాగరాజు, క్లష్టర్ ఇచచార్జి మురళీ బాబు, ఎంపీడీఓ సోనీబాయి, పంచాయతీ కార్యదర్శులు సావిత్రి, అశ్వత్థ, నాయకులు పాల్గొన్నారు.
అభాగ్యులకు ఎన్టీఆర్ భరోసా వరం
హిందూపురం(ఆంధ్రజ్యోతి): అభాగ్యులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎన్టీఆర్ భరోసా పింఛన వరం లాంటిదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. సోమవారం కొల్లకుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అంజినప్ప అందజేశారు. పట్టణంలోని ధర్మపురంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లను చైర్మన అందించారు. అమర్నాథ్, అశ్వత్థనారాయణ, తిరుపతయ్య, షబ్బీర్, అనిల్, సురేష్, యల్లప్ప పాల్గొన్నారు.
సోమందేపల్లి(ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ సజావుగా జరిగింది. సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఉదయం 6గంటల నుంచి ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించారు. వినాయకనగర్‌లో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఈఓఆర్డీ ప్రేమ్‌కుమార్, టీడీపీ నాయకులు నీరుగంటి చంద్ర, కన్వీనర్ వెంకటేశులు, సూరీ, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, బీజేపీ నాయకులు మంజు, జనసేన నాయకులు జబీవుల్లా లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము అందజేశారు.