MLA SRAVNI: రైతుల పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:59 PM
శింగనమల నియోజకవర్గ రైతుల పట్ల సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ అని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

నార్పల,ఏప్రిల్16(ఆంధ్రజ్యోతి): శింగనమల నియోజకవర్గ రైతుల పట్ల సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ అని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పాటు సూక్ష్మ సేద్యం ప్రాధాన్యతను వివరించారు. డ్రిప్ విధానం వల్ల నీటి పొదుపుతో పాటు తక్కువ ఖర్చులో అధిక దిగుబుడలు సాధించవచ్చని అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. తహసీల్దారు అరుణకుమారి, ఎంపీడీఓ భాస్కర్, రైతులు, టీడీపీ నాయకులు జీసీ బాబు, ఆకుల విజయ్‌కుమార్‌బాబు, ఆకుల ప్రసాద్, అనిల్, తేజ, హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలకు నిధులు మంజారు చేయిస్తా
శింగనమల: నార్పల బాలుర పాఠశాలలో మౌలిక సదుపాయాలకు నిధులు మంజారు చేసి అభివృద్ధికి బాట వేస్తానని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఎంపీడీఓ భాస్కర్,ఎంఈఓ క్రిష్ణయ్య, అధికారులు పాల్గొన్నారు.