Dear Parents: పేరెంట్స్‌కు గుడ్ న్యూస్.. నేటి నుంచి విద్యార్థులకు స్కూల్‌లోనే ఆధార్ అప్డేట్.. 26 లాస్ట్ డేట్
ABN , Publish Date - Nov 18 , 2025 | 03:52 PM
చిన్నారుల ఆధార్ కార్డు 5 ఏళ్ల వయసు దాటిన తర్వాత మొదటి అప్‌డేట్, 15 సంవత్సరాల వయసు దాటితే రెండవ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులకు అవగాహన లేకపోవడం, తల్లిదండ్రుల బిజీ షెడ్యూల్ కారణంగా దీని గురించి ఆలోచించరు. ఇప్పుడు..
ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. ఇది.. మీ పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు సులభమైన మార్గం. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ప్రభుత్వం ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని పాఠశాలల్లోనే కల్పిస్తోంది. నిన్నటి (నవంబర్ 17) నుంచి నవంబర్ 26 వరకు స్కూల్స్‌లలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.
ఫలితంగా 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు తమ ఆధార్ కార్డ్‌ను వారి వారి పాఠశాలల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్లలో గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఏపీ విద్యాశాఖ, యూఐడీఏఐ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీనిపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖ రాశారు.
ఈ ప్రత్యేక క్యాంపులలో విద్యార్థులు ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడంతోపాటుగా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ సేవలు పూర్తి ఉచితంగా అందిస్తారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పిల్లలు ఆధార్ అప్డేట్ చేసుకోలేదని, వారందరూ తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా ప్రభుత్వం నేరుగా పాఠశాలల్లోనే ఆధార్ కార్డు అప్డేట్ కోసం క్యాంపులను ఏర్పాటు చేసింది. పిల్లలు, వారి పేరెంట్స్ ఆధార్ సెంటర్లకు వెళ్లక్కరలేకుండా నేరుగా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఈ క్యాంపుల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. మరెందుకాలస్యం.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి మరి.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే
Read Latest AP News And Telugu News