V. Hanumanth Rao: అమిత్‌షాపై ప్రజలే తిరగబడతారు: వీహెచ్
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:29 AM
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్రమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పకుంటే.. ప్రజలు ఆయనపై తిరగబడతారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్రమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పకుంటే.. ప్రజలు ఆయనపై తిరగబడతారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. గురువారం గాంఽధీభవన్‌లో వీహెచ్ మాట్లాడుతూ.. ఇతరులెవరరైనా అంబేడ్కర్‌ను అవమానిస్తే కేసులు పెట్టి జైల్లో వేసేవారు.. కానీ అమిత్‌షా మీద ఏ చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ ఎన్నికై వందేళ్లు గడిచిన సందర్భంగా గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వీహెచ్ నివాళులర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీది కీలకపాత్రఅని చెప్పారు.
రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మిట్టపల్లి వెంకటేశ్..
రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మిట్టపల్లి వెంకటేశ్ నియమితులయ్యారు. ఈమేరకు జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్‌భాను చిబ్ నియామకపత్రాన్ని వెంకటేశ్‌కు అందజేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రె్‌సను పటిష్ఠం చేసేందుకు పాటుపడాలని వెంకటేశ్‌కు ఆయన సూచించారు.