రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై వాషింగ్టన్లో ఎన్నారైల సమావేశం
ABN, Publish Date - Jan 10 , 2024 | 10:13 AM
వాషింగ్టన్: తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంగా ఆదివారం (7వ తేదీ) అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ, ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్లో పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అభిమానులు సమావేశం నిర్వహించారు.

తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంగా ఆదివారం (7వ తేదీ) అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ. ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్లో సమావేశమైన ఎన్నారైలు..

వాషింగ్టన్ డీ.సీ ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్లో పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి అభిమానులు..

రేవంత్ రెడ్డి విజయవంతంగా అందిస్తున్న ప్రజాపాలనపై వేదికపై వక్తలు మాట్లాడుతుండగా ఆసక్తిగా తిలకిస్తున్న ఎన్నారైలు..

రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై వక్తల వ్యాఖ్యలపై ఎన్ఆర్ఐలు చప్పట్లతో హర్షధ్వానాలు చేస్తున్న దృశ్యం.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది సోదరులు, ప్రముఖులు ఆసీనులై సమావేశాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న దృశ్యం.

సమావేశం ముగిసిన అనంతరం ఎన్నారైలు కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు చప్పట్లతో అభినందనలు తెలుపుతున్న దృశ్యం.
Updated at - Jan 10 , 2024 | 10:14 AM