Share News

Business News: ఎలక్ట్రిక్ వాహనాలపై మహీంద్రా అండ్ మహీంద్రా కీలక ప్రకటన.. అన్ని సేవలు ఒకే దగ్గర

ABN , Publish Date - Dec 01 , 2024 | 04:06 PM

కొత్తగా లాంచ్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. వీటి విక్రయానికి కొత్త సేల్స్ నెట్ వర్క్ ఏర్పాటుపై స్పందించింది..

Business News: ఎలక్ట్రిక్ వాహనాలపై మహీంద్రా అండ్ మహీంద్రా కీలక ప్రకటన.. అన్ని సేవలు ఒకే దగ్గర
Mahindra and Mahindra

మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిపై కీలక ప్రకటన చేసింది. ఎకల్ట్రికల్ వాహనాలను విక్రయించేందుకు కూడా ప్రస్తుతం ఉన్న సేల్స్ నెట్ వర్క్ నే ఉపయోగించుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ దిగ్గజ వాహన తయారీదారు సంస్థ తమకు చెందిన అన్ని వాహనాలను ఒకే నెట్ వర్క్ కింద అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. థార్, స్కార్పియో వంటి మోడళ్లను విక్రయించే ముంబైకి చెందిన ఈ ఆటోమేజర్.. ఇప్పుడు రెండు సరికొత్త గ్రౌండ్ అప్ మోడల్స్ ను సైతం మార్కెట్లోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి బీఈ 6ఈ కాగా.. మరొకటి ఎక్స్ ఈవీ 9ఈ. కొత్తగా తీసుకువచ్చిన ఈ మోడల్స్ తో తమ ఎలక్ట్రికల్ వాహన శ్రేణిని పెంచుకుంది. ఇక ఈవీ సేల్స్ నెట్ వర్క్ పై మాట్లాడుతూ..


కంపెనీ తన ఈవీ శ్రేణి కోసం ప్రత్యేక సేల్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడాన్ని కూడా పరిశీలిస్తుందా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. "మేము సేల్స్ కి సంబంధించిన అన్ని ఎంపికలను ఒకే చూరు కింద కస్టమర్లకు అందించాలని అనుకుంటున్నాం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో రాజేష్ జెజురికర్ తెలిపారు. ప్రత్యర్థి టాటా మోటార్స్ సైతం ఈవీ మోడళ్లను విక్రయించడానికి ప్రత్యేక విక్రయ ఛానెల్‌ను ఏర్పాటు చేసింది.


కొత్తగా ప్రవేశపెట్టిన ఈవీ మోడల్స్.. బీఈ 6ఈ , ఎక్స్ ఈవీ 9ఈ డెలివరీలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్యలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కంపెనీ ఒక ఎలక్ట్రిక్ మోడల్ ఎక్స్ యూవీ 400ను విక్రయిస్తోంది. ఈవీల కోసం ప్రత్యేక సేల్స్ నెట్‌వర్క్ లేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ, జెజురికర్ ఇలా అన్నారు.. "ఒక కస్టమర్ మా అవుట్‌లెట్‌లోకి రావాలంటే, వారు మా అన్ని ఉత్పత్తులను చూడాలి. తద్వారా వారు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. ఇలా కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ తీసుకుంటారు (మోడల్ ). కాబట్టి ఇది డిమాండ్‌ను పెంచుకునే అవకాశం ఉంది" అని తెలిపారు.

Real vs Fake Charger: మీ ఫోన్ ఛార్జర్ నిజమైనదా, నకిలీదా.. ఇలా గుర్తించండి..


Updated Date - Dec 01 , 2024 | 04:06 PM