Pradeep Kumar: అనివార్య కారణాల వల్ల అమిత్ షా సభ వాయిదా..
ABN , First Publish Date - 2023-06-14T16:51:46+05:30 IST
ఖమ్మం: అనివార్య కారణాల వల్ల కేంద్రమంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటన వాయిదా పడిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.

ఖమ్మం: అనివార్య కారణాల వల్ల కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) ఖమ్మం పర్యటన వాయిదా పడిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ (Pradeep Kumar) పేర్కొన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ (Gujarath), మహారాష్ట్ర (Maharashtra)లో బీభత్సం సృష్టిస్తున్న బిపర్‌జాయ్ తుఫాన్ (Biparjoy Cyclone) కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని అన్నారు. అమిత్ షా గుజరాత్‌లోనే ఉండి... తుపానును సమీక్షించాలని ప్రధాని మోదీ ఆదేశించారన్నారు. మోదీ, షా.. తుపాను సహాయక చర్యలను సమీక్షిస్తున్నారన్నారు.
కాగా ఇప్పటి వరకు ఖమ్మంలో జరగని విధంగా అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాట్లు చేశామని ప్రదీప్ కుమార్ తెలిపారు. ఖమ్మంలో అడుగడుగునా కాషాయమయం కావాలని, ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు 10 రోజులు కష్టపడి ఏర్పాట్లు చేశారన్నారు. రాబోయే రోజుల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..
గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తుఫాన్ గండం పొంచి ఉండడంతో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడిందని పొంగులేటి అన్నారు. కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లో ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సుమారు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భగవంతుడి ఆశీస్సులతో తుఫాన్ ముప్పు ఎక్కువగా ఉండకూడదని కోరుకోవాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.