Hero Maestro Xoom: ‘హీరో’ నుంచి ‘మ్యాస్ట్రో జూమ్’.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు!
ABN , First Publish Date - 2023-01-29T17:06:48+05:30 IST
దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటో కార్ప్ సోమవారం (30న) మరో సరికొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీనికి

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటో కార్ప్ సోమవారం (30న) మరో సరికొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీనికి ‘మ్యాస్ట్రో జూమ్ 110’(Maestro Xoom 110) అని పేరు పెట్టింది. స్టాండర్డ్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్లతో ఈ స్కూటర్‌ను తీసుకొస్తోంది. మ్యాస్ట్రో జూమ్ మోడల్‌ను గతేడాది పండుగ సీజన్‌లోనే లాంచ్ చేయాలని భావించినప్పటికీ వాయిదా వేసి ఈ ఏడాది విడుదల చేస్తోంది.
మ్యాస్ట్రో జూమ్ పూర్తిగా కొత్త ఫీచర్లు, కొత్త లుక్‌తో ఆకట్టుకునేలా ఉంది. హెచ్ (H) ఆకారంలోని ఎల్‌ఈడీ డీఆర్ఎల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తోపాటు సరికొత్త ఎక్స్ (X) ఆకారంలోని ఎల్‌ఈడీ టైలైట్ అమర్చారు. ఇందులో తీసుకొచ్చిన మరో అద్భుతమైన ఫీచర్.. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకునే వెసులుబాటు. ఇందుకోసం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్(Digital Instrument Console)లో అవసరమైన మార్పులు చేసింది. టర్న్ బై టర్న్ నేవిగేషన్, కాల్, ఎస్సెమ్మెస్ అలెర్టులు కూడా ఉన్నాయి. 12 అంగుళాల అలాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్‌బ్రేక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మూడు వేరియంట్లలో దీనిని తీసుకొస్తోంది.
డిస్క్ బ్రేక్
ఇక, పవర్‌ట్రైన్ విషయానికి వస్తే.. ఇందులో ఎక్స్‌సెన్స్ (XSens) ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో 110 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్‌ను అమర్చారు. ఇది 7,250 ఆర్‌పీఎం వద్ద 8 బీహెచ్‌పీ.. 5,750 ఆర్పీఎం వద్ద 87 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మోటార్ సీవీటీ యూనిట్‌తో కలిసి ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనక హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ ఉంటుంది. బ్రేకింగ్ వ్యవస్థ కాంబి బ్రేకింగ్ డిస్క్, డ్రమ్ బ్రేక్ సెటప్‌తో వస్తోంది.
హోండా డియోతో పోటీ
హోండా కూడా యాక్టివా 6జీ 110 (Honda Activa 6G 110) ఇటీవల కొత్త టాప్ ఎండ్ హెచ్ (H) స్మార్ట్ వేరియంట్‌తో అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు హీరో తన కొత్త మ్యాస్ట్రో జూమ్‌ను మరింత స్పోర్టీగా తీర్చిదిద్దింది. కాబట్టి ఈ సెగ్మెంట్‌లో హోండా డియోతో ఇది పోటీపడే అవకాశం ఉంది. మ్యాస్ట్రో జూమ్ ఎక్స్ షో రూమ్(ex-showroom) ధర రూ. 75 వేల నుంచి 80 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. స్కూటర్ లాంచ్ సందర్భంగా ఈ స్కూటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.