High Court: రైతుల పాదయాత్ర పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు
ABN , First Publish Date - 2022-10-28T18:28:31+05:30 IST
రైతుల (Farmers) పాదయాత్ర పిటిషన్లపై ఏపీ హైకోర్టు (AP High Court)లో వాదనలు పూర్తయ్యారు. న్యాయమూర్తి (Judge) తీర్పును రిజర్వ్‌లో పెట్టారు.

అమరావతి: రైతుల (Farmers) పాదయాత్ర పిటిషన్లపై ఏపీ హైకోర్టు (AP High Court)లో వాదనలు పూర్తయ్యారు. న్యాయమూర్తి (Judge) తీర్పును రిజర్వ్‌లో పెట్టారు. రైతుల తరపున లాయర్లు పోసాని వెంకటేశ్వర్లు, ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని లాయర్లు (Lawyers) కోరారు. రైతులు 600 మంది మాత్రమే పాల్గొంటారని చెప్పిన పిటిషనర్లు, సంఘీభావం తెలిపేవారు పాదయాత్రలో ముందు, వెనకా నడిచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతుల పాదయాత్రను మంత్రులు అడ్డుకుంటామంటున్న నేపథ్యంలో వైసీపీ నేతల నుంచి రక్షణ కల్పించాలని కోర్టుకు అభ్యర్థించారు. ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. మంత్రులు ధర్మాన, అమర్నాథ్ తరపున మరికొందరు లాయర్ల వాదించారు. రైతుల పిటిషన్లకు విచారణ అర్హత లేదని న్యాయవాదుల వాదించారు. పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరినట్లు ఏజీ తెలిపారు. గుడివాడలో పోలీసులపై దౌర్జన్యం, ట్రాఫిక్ నిబంధనలు, అమరావతి రైతులు ఉల్లంఘించారని ఏజీ వాదనలు పేర్కొన్నారు. ఇరుపక్షాల వీడియో టేప్‌లను పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.