Miss World 2025: మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Seethakka On Operation Kagar: ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు.
Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
MLA Sudheer Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన గొడవ సందర్భంగా హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్‌ను ఉద్దేశించి సుధీర్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుజాతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రిమాండ్‌లో ఉన్న ఈఎన్సీ హరీరామ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీ కోసం ప్రభుత్వం కసరత్తు పూర్తి అయ్యింది. మొత్తం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్‌ల పేర్లను యూపీఎస్సీకి సర్కార్ పంపించింది.
Pakistani Citizens: వీసా గడువు ఈరోజుతో ముగియనుండటంతో పాకిస్థానీలు భారత్‌ను వీడుతున్నారు. నలుగురు పాకిస్థాన్ వాసులు హైదరాబాద్‌ను వీడి స్వదేశానికి వెళ్లిపోయారు.
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి కాకినాడ, నర్సాపూర్ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిప్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో నిర్మించి రెండు వంతెనలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కోట్లాది రూపాయలతో ఈ వంతెనలను నిర్మించారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవి అందుబాటులోకి కావడం ద్వారా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.