Share News

పంచాయతీల్లో కాంగ్రెస్‌ ఘన విజయం

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:36 PM

పంచాయతీ ఎన్నికలలో గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని మరోసారి రుజువు చేసిందని ప్రజాపాలనకు ఇదే నిదర్శనం అని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

పంచాయతీల్లో కాంగ్రెస్‌ ఘన విజయం
మాట్లాడుతున్న జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత

- 131లో 108స్థానాల్లో విజయదుందుబీ

- జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలలో గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని మరోసారి రుజువు చేసిందని ప్రజాపాలనకు ఇదే నిదర్శనం అని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలో 131 పంచాయతీలో ఉండగా అందులో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో 108మంది గెలుపొందారని అన్నారు. ఇందులో నేను బలపర్చిన అభ్యర్థులు 51మంది ఉన్నారని వారు నాకోసం పనిచేయడంతో వారికి నేను అండగా ఉన్నానని తెలిపా రు. మిగిలిన 557మంది ఎమ్మెల్యే వర్గం వారి నుంచి గెలుపొందారని వివరించారు. వెనకబడి న జిల్లా అయినప్పటికీ రాష్ట్రంలోనే ఎక్కువ మంది సర్పంచులు ఇక్కడే గెలిచారని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన, కాంగ్రెస్‌ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆక ర్షితులై పార్టీకి అండగా ఉన్నారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ పార్టీ నడిపిస్తున్న విధానం కూడా పార్టీ విజయానికి కారణం అయ్యిందని, రాబోయే కాలంలో మిగిలిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు అవు తాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులు గ్రామ పాలనను కొనసాగించి గ్రామాల అభివృద్దికి కృషి చేస్తారని అన్నారు. గ్రామాలలో ఎవ రు అభివృద్ధి చేస్తారో ప్రజలు గుర్తించి పట్టం కట్టారని అన్నారు. గద్వాల నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా సర్పంచులుగా ఎన్నికయ్యారని బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే నిదర్శనం అన్నారు. తనపై నమ్మం ఉంచి నేను నిలబెట్టిన అభ్యర్థులను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు అని అమె ముగించారు. కార్యక్రమంలో సర్పంచులుగా గెలుపొందిన అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 11:36 PM