Home » YuvaGalam
Yuvagalam Book: యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రి లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకంపై లోకేష్‌ను పవన్ అభినందించారు.
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ వడివడిగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలతో మంత్రి నారా లోకేష్ శెభాష్ అనిపించుకుంటున్నారు.
తన పాదయాత్రలో ఇచ్చిన తొలి హామీని అమలు చేసేందుకు వచ్చిన మంత్రి లోకేశ్ పర్యటన విజయవంతమైంది.
ఏపీ మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం 10నుంచి 11గంటల మధ్య బంగారుపాళ్యం గ్రామానికి చేరుకుంటారు. ఎన్నికల హామీ మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన తొలి హామీ నెరవేర్చడానికి యువనేత నారా లోకేశ్ గురువారం రాత్రి 11.20 గంటలకు బంగారుపాళ్యం చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. అసలు ఘట్టానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు.
సీఎం జగన్ (CM Jagan) నీ టైమ్ అయిపోయిందని.. ఈనెల 13న రెండు సింహాలు( చంద్రబాబు, పవన్ కళ్యాణ్) మధ్య నలిగిపోవడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) హెచ్చరించారు. సింహాం సింగిల్‌గా వస్తుందని జగన్ మాటిమాటికీ అంటున్నారని.. కానీ ఆ రెండు సింహాల మధ్య నలిగి పోతాడని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
సీఎం జగన్ రెడ్డి (CM Jagan) చేసిన తప్పులకు వదిలిపెట్టమని...చట్టపరిధిలో చర్యలు తప్పవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) మాస్ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల యువగళం సభలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోనని ఉద్ఘాటించారు.
Andhrapradesh: నంద్యాలలో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ యువగళం సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు (శుక్రవారం) నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభ జరుగనుంది. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహించనున్నారు.