Home » Toli Ekadasi
Tholi Ekadashi Rituals and Benefits: హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజును తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నుంచే విష్ణువు యోగనిద్రలోకి జారుకుంటాడు. అంతేకాదు,ఇవాళ నుంచే హిందువుల పండగలు మొదలువుతాయి.
పండగల్లో తొలి ఏకాదశికి(Toli Ekadashi 2024) ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏడాది జులై 16న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఏకాదశి ఘడియలు జులై 17 బుధవారం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు ముగుస్తాయి.
ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. తెలుగు క్యాలెండరులో తొలి ఏకాదశి తర్వాత నుంచి పండుగలు ప్రారంభమవుతాయి.