Home » Rajinikanth
తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. రజనీ కలకాలం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించారు.
రజనీకాంత్ అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరు, ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్నను చూడ్డానికి రజనీకాంత్ ఆస్పత్రికి వెళ్లారు. అన్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
రజనీకాంత్ హిమాలయాల పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత 'జైలర్-2' చిత్రీకరణలో పాల్గొనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ గుడిలో ఏకంగా 230 తలైవా ప్రతిమలు ఉన్నాయి. వాటిని 15 వరసల్లో ఏర్పాటు చేశాడు. పది వరుసల్లో రజినీకి సంబంధించిన టాప్ ఫొటోలు ఉన్నాయి.
నటుడు రజనీకాంత్ ‘కూలీ’ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ పంపిణీ చేయలేమని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రజనీకాంత్ నటించి ఇటీవల విడుదలైన కూలీ చిత్రానికి సెన్సార్‌బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ పంపిణీ చేయడం వల్ల ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో పిల్లలను అనుమతించడంలేదు.
రజనీకాంత్ సినిమాలు లెక్కలేనన్ని జీవితాలను తాకాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. నడక, సంభాషణలు పలకడం, హావభావ విన్యాసాల్లో రజనీ ప్రత్యేకతను చూపిస్తారని తెలిపారు.
నటుడిగా రజనీకాంత్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతినాయక పాత్ర పోషించినా.. కథానాయకుడిగా మెప్పించినా రజనీకాంత్ తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారంటూ ప్రశంసించారు.
సినీ పరిశ్రమలో తన 50 ఏళ్ళ ప్రయాణానికి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ సూపర్‌స్టార్ రజనీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. దీరిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీరిపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Coolie Movie Mania: ఇప్పటి వరకు తమిళ సినిమాకు ఒక్క 1000 కోట్ల రూపాయల సినిమా కూడా లేదు. తమిళ తంబీలు కూలీ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనైనా 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు.