Rajinikanths Brother: సోదరుడికి గుండెపోటు.. హుటాహుటిన ఆస్పత్రికి సూపర్ స్టార్
ABN , Publish Date - Nov 08 , 2025 | 08:17 PM
రజనీకాంత్ అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరు, ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్నను చూడ్డానికి రజనీకాంత్ ఆస్పత్రికి వెళ్లారు. అన్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంలో సడెన్ మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. రజనీకాంత్ అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన బెంగళూరు, ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి వైద్యులు సత్యనారాయణను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అన్న సత్యనారాయణకు గుండెపోటు వచ్చిందని తెలియగానే రజనీకాంత్ హుటాహుటిన బెంగళూరు బయలుదేరారు.
ఆస్పత్రికి వెళ్లిన రజనీ ఐసీయూలోని అన్నను చూసి భావోద్వేగానికి గురయ్యారు. అన్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రజనీ ఆస్పత్రిలో ఉన్న దృశ్యాల తాలూకా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రజనీ ఫ్యాన్స్, ఇతర నెటిజన్లు సత్యనారాయణ రావు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, డాక్టర్లు సత్యనారాయణ రావు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అన్న అనారోగ్యం నేపథ్యంలో రజనీకాంత్ బెంగళూరులోనే ఉండిపోయారు. ఎప్పటికప్పుడు అన్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. కాగా, రజనీకి అన్న సత్యనారాయణరావుతో మంచి అనుబంధం ఉంది. రజనీ నేడు సూపర్ స్టార్‌గా వెలుగొందడం వెనుక అన్న శ్రమ కూడా ఉందని రజనీ పలు సందర్భాల్లో చెప్పారు. అన్న తనకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని అన్నారు.
ఇవి కూడా చదవండి
రోడ్లపై వీవీప్యాట్ స్లిప్పులు.. ఇద్దరు అధికారుల సస్పెండ్
ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వ్యవసాయం ఎలా చేస్తున్నాడో చూడండి..