Home » PV Sindhu
పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె సురక్షితంగా భారత్ చేరుకున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులను మాత్రమే కాక, అంతర్జాతీయ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, నటుడు మంచు విష్ణు, పలువురు తెలుగు ప్రముఖులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు..
యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక అని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ వ్యాఖ్యానించారు. శాప్ లీగ్ మ్యాచ్‌ల ద్వారా యువతకు సువర్ణావకాశం లభిస్తుందని పేర్కొన్నారు..
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. కెరీర్‌లో 500 మ్యాచుల్లో విజయం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు క్రియేట్ చేసింది.
ఇటీవలే జరిగిన మలేసియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే గాయం బారిన పడిన సింధు.. సుదీర్ఘ కాలం తర్వాత ఆ టోర్నీతోనే రీఎంట్రీ ఇచ్చింది. ఆటకు దూరమైన నాటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుందో తాజాగా సింధు వివరించింది.
మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు నిష్ర్కమించింది. శనివారం జరిగిన సెమీస్‌లో సింధు పరాజయం పాలైంది. సెమీ ఫైనల్ మ్యాచులో చైనాకు చెందిన రెండో సీడ్ వాంగ్ జి యి చేతిలో సింధు 16-21, 15-21 వరుస గేమ్‌లు కోల్పోయి ఓటమి పాలైంది.
మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఆమె ప్రత్యర్థి జపాన్‌కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగుచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో.. సింధు తన తొలి ఆటను 21-11 తేడాతో గెలుచుకుంది.
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు వెల్లడించింది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.
ప్రీక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ వాంగ్ జి యీని వరుస గేముల్లో చిత్తు చేయడంతో..భారత స్టార్ పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌షి్‌పలో ఆరో పతకం సాధిస్తుందని భావించారు. కానీ సింధుకు నిరాశ తప్పలేదు...
తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మళ్లీ అదరగొట్టింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడు గేమ్స్ గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ప్రపంచ నెంబర్ 2 ప్లేయర్ వాంగ్ జీ యిని సింధు ఈజీగా ఓడించింది.