Home » Madanapalle
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
మదనపల్లిలో చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టతనిచ్చారు. కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు.
మదనపల్లిలో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిన్నారికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.
అన్నమయ్య జిల్లా స్థూల ఉత్పత్తిలో రెండేళ్లుగా నిలకడగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయం గత ఏడాదితో పోల్చితే దిగజారింది.
జిల్లాలోని మదనపల్లె, ములకలచెరువు, గుర్రంకొండ, అంగళ్లు టమోటా మార్కెట్లలో మార్చి 2వ తేదీ నుంచి 15 కిలోల క్రేట్లతోనే టమోట వేలం నిర్వహించనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లాలో జలధార పథకంతో సాధించిన ప్రగతిని కేంద్రం దృష్టికి కలెక్టర్ నిశాంత్‌కుమార్ తీసుకెళ్లారు. జలవనరుల శాఖ, ఉపాధిహామీ పథకాలతో చేపట్టిన పనుల వివరాలతో నివేదికను పంపించారు.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులపై అదనపు చార్జీల భారం మోపితే చర్యలు తప్పవని ఆర్టీవో అశోక్‌ప్రతాప్ హెచ్చరించారు.
బోయకొండ పుణ్యక్షేత్రంలో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ చేపట్టినట్లు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు.
లబ్ధిదారులకు ఇకపై మెటీరియల్‌కు బదులుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో లబ్ధిదారులకు, గృహనిర్మాణ శాఖ అఽఽధికారులకు కూడా ఊరట కలిగింది.
పంటలపై ఏనుగుల దాడులు ఆగడం లేదు. పులిచెర్ల మండలంలోని పాళెం పంచాయతీలో ఒంటరి ఏనుగు మామిడి, కొబ్బరి చెట్లను విరిచేసింది. సోమల మండలంలో జంట ఏనుగులతోపాటు ఒంటరి ఏనుగు కలిసి వరినార్లు, మామిడి, అరటి తోటలను నాశనం చేశాయి.