Home » Kondagattu
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు.
Summer Trips From Hyderabad: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి, మనసును రీఛార్జ్ చేసుకునేందుకు వేసవి సెలవులను మించిన అద్భుత సమయం లేదు. మీరూ ఈ సమయంలో ప్రశాంతత, ఆనందం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలను తప్పక సందర్శించండి.
మహేశ్‌రెడ్డి వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చారు. స్వామి వారికి 325గ్రాముల బంగారం తాపడంతో రాగి రేకుపై కిరీటం, రామరక్షతో పాటు 48.5కిలోల వెండితో గర్భాలయ ద్వారానికి కుడి, ఎడమ వైపు ద్వార బందనం, తొడుగులు తయారు చేయించి ఆలయ అధికారులు, అర్చకులకు అప్పగించారు.
అయోధ్య రామ మందిరానికి సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి సహకారంతో నిర్మించిన ఽశ్రీరామ ధనుస్సుకు శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరి వచ్చారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసి కొండగట్టు భారీగా ఆయన ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు.
మాదాపూర్ నివాసం నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కొండగట్టు బయలుదేరారు. రోడ్డు మార్గంలో 11.30గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు కల్యాణ్ రానున్నారు.