Home » Araku valley
అరకు ఘాట్ రోడ్డులో బొలెరో వాహనం లోయలోకి బోల్తా కొట్టింది. అనంతగిరి మండలం తుమ్మనవలస దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో సుమారు 30 మంది కార్మికులు ఉండగా, 10 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అల్లూరి జిల్లాలోని బస్కి పంచాయతీ కంజరి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ గిరిజన రైతుకు సంబంధించిన కాఫీ తోట దగ్ధమైంది. ఈ ఘటనలో జి. అప్పలనాయుడుకి చెందిన సుమారు 2 ఎకరాల కాఫీ తోట మంటల్లో కాలిపోయింది.
అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు..
విశాఖపట్నం ప్రజలకు, ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.
అరకులోయ ఏరియా ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లేడీస్ బాత్‌రూమ్‌లో ఒక నవ జాతి శిశువు మృతదేహం తీవ్ర కలకలం రేపింది.
వరుస సెలవుల నేపథ్యంలో అరకు వ్యాలీని సందర్శించేందుకు జనం ఎగబడుతున్నారు. దీంతో సమీపంలోని పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ప్రకృతి అందాల మధ్య అరకు వ్యాలీ ఉడెన్ బ్రిడ్జ్ సందర్శన అనుభూతి ఒక అద్భుతం. అయితే, పర్యాటకుల రద్దీ పెరగడం, ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో అధికారులు సందర్శన వేళల్లో మార్పులు చేశారు.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైజ్ఞానిక, సాంస్కృతిక స్పిరిచువల్ అండ్ కల్చరల్ వెల్‌నెస్ సెంటర్ నిర్మిస్తామని పతంజలి వ్యవస్థాపకులు, ప్రఖ్యాత యోగా గురువు బాబా రాందేవ్ తెలిపారు.
అరకు టు హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారినుంచి 3.80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వేసవి కాలం వచ్చేసింది.. ఈ సమ్మర్‌లో తక్కువ ఖర్చుతో అద్భుతమైన సందర్శనీయ స్థలాలు చూడాలని భావిస్తున్నారా.. అయితే తెలుగు రాష్ట్రాల్లోని బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేసెస్ లిస్ట్ మీ కోసం..