Share News

నాపై ఆరోపణలు శుద్ధ అబద్ధం

ABN , Publish Date - Apr 05 , 2026 | 07:07 AM

సహచర నేతలు తనపై చేసిన మూడు ఆరోపణలూ శుద్ధ అబద్ధాలని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా స్పష్టం చేశారు. తనను రాజ్యసభలో పార్టీ ఉపనేతగా తొలగించిన...

నాపై ఆరోపణలు శుద్ధ అబద్ధం

  • గాయపడిన నేను.. ప్రమాదకారిని: రాఘవ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: సహచర నేతలు తనపై చేసిన మూడు ఆరోపణలూ శుద్ధ అబద్ధాలని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా స్పష్టం చేశారు. తనను రాజ్యసభలో పార్టీ ఉపనేతగా తొలగించిన నాయకత్వం తీరుతో గాయపడిన తాను.. ప్రమాదకారినంటూ.. ‘ఘాయల్‌ హూ.. ఇసీలియే ఘాతక్‌ హూ’ అని ‘దురంధర్‌’ సినిమా డైలాగ్‌ వదిలారు. శుక్రవారం నుంచి పథకం ప్రకారం తనపై దుష్ప్రచారం జరుగుతోందని శనివారం ‘ఎక్స్‌’లో వీడియో ద్వారా తెలిపారు. చద్దా బీజేపీలో చేరబోతున్నారని.. ఆప్‌ సిద్ధాంతాలపై రాజీపడ్డారని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఢిల్లీ మాజీ సీఎం ఆతిశి తదితరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘ఆప్‌ నాయకత్వం నాపై మూడు ఆరోపణలు చేసింది. ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసినప్పుడు నేను బయటకు వెళ్లకుండా కూర్చుండిపోతున్నానన్నది తొలి ఆరోపణ. ఇది అబద్ధం. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)ను తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన పిటిషన్‌పై నేను సంతకం చేయలేదనేది రెండో ఆరోపణ. రాజ్యసభలో పార్టీకి పది మంది ఎంపీలున్నారు. వీరిలో ఆరేడుగురు దానిపై సంతకాలు చేయలేదు. నన్నే ఎందుకు తప్పుబడుతున్నారు? బీజేపీకి భయపడి సభలో నేను పసలేని సమస్యలను లేవనెత్తుతున్నానన్నది మూడో ఆరోపణ. కానీ నేను ఎన్నో కీలకమైన అంశాలను రాజ్యసభలో లేవనెత్తాను’ అని రాఘవ్‌ తన వీడియో పోస్టులో స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 07:07 AM