అమెరికా మమ్మల్ని టాయ్‌లెట్ పేపర్‌లా వాడుకుంది
ABN , Publish Date - Feb 12 , 2026 | 06:29 AM
పాకిస్థాన్‌ను అమెరికా టాయ్‌లెట్ పేపర్‌లా వాడుకుందని దాయాది దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ సాయం కావాల్సి వచ్చినప్పుడు బాగా...
అగ్రరాజ్యం కోసం ఎన్నో యుద్ధాలు
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 11: పాకిస్థాన్‌ను అమెరికా టాయ్‌లెట్ పేపర్‌లా వాడుకుందని దాయాది దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ సాయం కావాల్సి వచ్చినప్పుడు బాగా వాడుకుని, అవసరం తీరగానే అమెరికా తమను పక్కన పడేసిందని ఆయన ఆక్షేపించారు. అయినా, గుణపాఠం నేర్చుకోలేదన్నారు. ఇస్లామాబాద్‌లోని షియా మసీదులో ఇటీవల జరిగిన భారీ బాంబు పేలుళ్ల ఘటనపై పార్లమెంటులో మాట్లాడుతూ, ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా కోసం తనకు సంబంధం లేని అనేక ‘సూపర్ యుద్ధాల్లో’ పాక్ పాల్గొన్నదన్నారు. ‘‘అఫ్ఘాన్ విషయంలో రెండు సందర్భాల్లో అమెరికా తరఫున పోరాడాం. 1979లో అఫ్ఘాన్‌పై రష్యా దురాక్రమణ సమయంలో తొలిసారి, 2001లో తాలిబన్లపై జరిగిన పోరాటంలో రెండోసారి యుద్ధంలో పాల్గొని తప్పుచేశాం. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాం. అప్పట్లో దేశ పాలకులుగా ఉన్న ఇద్దరు నియంతలు తమ అధికారం నిలుపుకోవడం కోసం, తమ పాలనకు అగ్రరాజ్యం మద్దతు సాధించడం కోసం ఈ యుద్ధాల్లోకి పాక్‌ను లాగారు. ఈ సమయంలో మన దేశాన్ని, మన భూభాగాలను వాడుకుని, ఆ తర్వాత టాయ్‌లెట్ పేపర్ కంటే ఘోరంగా అమెరికా తీసిపారేసింది’’ అని ఖవాజా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News