Share News

యుద్ధం వేళ సొమ్ము చేసుకుందాం..

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:35 AM

ఇరాన్‌తో యుద్ధాన్ని వాడుకుని సొమ్ము చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమారులు తమ వ్యాపార వ్యూహాలు అమలు చేస్తున్నారు....

యుద్ధం వేళ సొమ్ము చేసుకుందాం..

  • ట్రంప్‌ కుమారుల వ్యాపార వ్యూహాలు

  • తమ డ్రోన్లు కొనాలంటూ గల్ఫ్‌ దేశాలపై ఒత్తిడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: ఇరాన్‌తో యుద్ధాన్ని వాడుకుని సొమ్ము చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమారులు తమ వ్యాపార వ్యూహాలు అమలు చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ తమకు వాటాలు కలిగిన కంపెనీ డ్రోన్లు కొనుగోలు చేయాలని గల్ఫ్‌ దేశాలపై ఎరిక్‌ ట్రంప్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ఒత్తిడి తెస్తున్నారు. ఫ్లోరిడాలోని తమ స్టార్టప్‌ కంపెనీ పవరెస్‌ డ్రోన్లను గల్ఫ్‌ దేశాలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారంటూ ది అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఓ కథనం ప్రచురించింది. డ్రోన్ల అమ్మకాల కోసం వారు ఆ దేశాలపై విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారంటూ మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ వద్ద పనిచేసిన రిచర్డ్‌ పెయింటర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అనుమతి లేకుండా చేస్తున్న యుద్ధం ద్వారా డబ్బు సంపాదించే మొట్టమొదటి అధ్యక్షుడి కుటుంబం ట్రంప్‌దే అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. మరోవైపు పవరెస్‌ కంపెనీ తమ డ్రోన్లపై పశ్చిమాసియాలో డెమోలు నిర్వహిస్తోంది. ఇంటర్‌సెప్టర్ల అమ్మకాల కోసం ఆ కంపెనీ బృందం ప్రయత్నిస్తోంది. తమ అద్భుత టెక్నాలజీతో ప్రజలకు రక్షణ కలుగుతుందంటూ పవరెస్‌ సహ వ్యవస్థాపకుడు బ్రెట్‌ వెలికోవిచ్‌ భరోసా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 06:35 AM