నన్ను కూడా చంపండి అంటే మోదీకి చెప్పుకో అన్నారు

ABN, Publish Date - Apr 23 , 2025 | 10:54 AM

తన భర్తను కాల్చి చంపిన ఉగ్రవాదుల ఎదుట ఆమె రోదిస్తూ తనను కూడా చంపమని వేడుకుంది. అయితే మేము నిన్న చంపమని ఇక్కడ జరిగిన సంఘన పోయి మోదీకి చెప్పు.. అంటూ వాళ్లలో ఒకరు బదులిచ్చారని ఆమె వాపోయింది.

పహల్గాం/న్యూఢిల్లీ: ‘పో.. ఇక్కడ జరిగింది మోదీకి చెప్పు’.. నన్ను కూడా చంపేయండి అని తన భర్తను చంపిన ఉగ్రవాదుల ఎదుట రోదించిన మహిళకు ఓ ఉగ్రవాది ఇచ్చిన సమాధానమిది. కర్ణాటకలోని షిమోగకు చెందిన మంజునాథ్‌, పల్లవి, తమ కుమారుడు అభిజయ్‌తో కలిసి కశ్మీరు పర్యటనకు వెళ్లి.. పహల్గాం సందర్శనకు వెళ్లగా.. మంజునాథ్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ‘‘ముగ్గురు, నలుగురు మాపై దాడి చేశారు. నా కళ్ల ముందే నా భర్తను కాల్చారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నా భర్తను చంపారుగా నన్ను కూడా చంపేయండి.. అని వాళ్లని అడిగా.. మేము నిన్ను చంపం.. పోయి ఇక్కడ జరిగింది మోదీకి చెప్పు.. అని వాళ్లలో ఒకరు బదులిచ్చారు’’ దాడి అనంతరం పల్లవి చెప్పిన మాటలివి.

Also Read..: విశాఖ వాసిని వెంటాడి మరీ కాల్చి చంపారు..


కాగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. అనంతనాగ్‌ జిల్లాలోని పహెల్‌గామ్‌లో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసారన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో అతి పెద్ద ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దల్లా పేర్కన్నారు. కాగా ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర హోమంత్రి అమిత్ షా కశ్మీరుకు చేరుకున్నారు.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, నిఘా విభాగం డైరెక్టర్‌ తపన్‌ డేకాతో అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీరు డీజీపీ నళిన్‌ ప్రభాత్‌ పహల్గాం ఉగ్ర దాడి వివరాలను తెలియజేశారు. పహల్గాంలో పరిస్థితిపై ఉన్నతాధికారులతో షా సమీక్షించారు. ఈ రోజు ఆయన ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. కాగా మృతుల్లో ఇద్దరు విదేశీయులు (ఇజ్రాయెల్‌, ఇటలీ దేశస్థులు), ఇద్దరు స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ప్రారంభం..

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు

పచ్చని కొండల్లో నెత్తుటేర్లు

For More AP News and Telugu News

Updated at - Apr 23 , 2025 | 10:56 AM