తెలంగాణలో కలకలం రేపుతున్న కేసులు
ABN, Publish Date - Apr 23 , 2025 | 11:16 AM
చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోలీసులు ఫోక్సో కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ నిందితుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. చిన్న పిల్లలను టార్గెట్‌గా చేసుకుని వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.ఈ ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో ఇటీవల కాలంలో చిన్నారులను టార్గెట్‌గా చేసుకుని చాలా మంది చిన్నారులపై అఘాయిత్యానికి (Child Abuse Cases) పాల్పడుతున్న సంఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. వీటిపై 2024లో దాదాపు 449 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ ఏడాది మార్చి వరకు 157 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు పోలీసుల విచారణలో ఎక్కువ మంది పిల్లలకు తెలిసిన వారే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఫోక్సో కేసులు (POCSO Cases) నమోదు చేస్తున్నప్పటికీ చాలా మందిలో మార్పు రాలేదు. చిన్న పిల్లలను టార్గెట్‌గా చేసుకుని వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి.
Also Read..: నన్ను కూడా చంపండి అంటే మోదీకి చెప్పుకో అన్నారు
ఇప్పటికే ఈ కేసులపై న్యాయస్థానాల్లో చార్జిషీటులు ఫైల్ చేసి నిందితులకు శిక్షలు ఖారారు చేస్తున్నప్పటికీ.. ఫోక్సో కేసులపై అవగాహన లేకపోవడం.. చాలా మంది తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోక్సో కేసులను ఏ విధంగా దర్యాప్తు చేస్తారు.. ఈ కేసుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చిన్నపిల్లలపై అఘాయిత్యం జరిగిన సమయంలలో వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయకుండ ఉండడానికి గల కారణాలేంటి.. వీటన్నింటికి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఈ వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ వాసిని వెంటాడి మరీ కాల్చి చంపారు..
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ప్రారంభం..
For More AP News and Telugu News
Updated at - Apr 25 , 2025 | 01:29 PM