ఉగ్ర దాడి పర్యటకులపై కాదు భారత్‌పై..: మోదీ

ABN, Publish Date - Apr 24 , 2025 | 02:03 PM

ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చిందని, ఉగ్రదాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. ఊహకు మించిన ప్రతీకారం ఉంటుందని, ప్రతీకారం ఎలా ఉంటుందో.. ప్రపంచం కూడా చూడబోతోందని అన్నారు.

బిహార్‌: ఉగ్రవాదులకు ప్రధాని మోదీ (PM Modi) స్ట్రాంగ్ వార్నింగ్ (Strong warning) ఇచ్చారు. ఉగ్ర దాడి (terror attack) మృతులకు యావత్ దేశం అండగా ఉందని, అమాయకులను అన్యాయంగా బలి తీసుకున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం బీహార్‌లో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. ఉగ్ర దాడి పర్యాటకులపై కాదని.. భారత్‌పై జరిగిందని అన్నారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చిందని, ఉగ్రదాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ఊహకు మించిన ప్రతీకారం ఉంటుందని, ప్రతీకారం ఎలా ఉంటుందో.. ప్రపంచం కూడా చూడబోతోందని అన్నారు. ప్రతీ ఒక్క ఉగ్రవాదిని ఏరిపారేస్తామని, ఉగ్ర నేతలను కూడా విడిచిపెట్టేది లేదని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానని.. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: ఆ శాఖను ఇష్టపూర్వకంగా ఎంచుకున్నా..


ఈ వార్తలు కూడా చదవండి..

సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..

అరుదైన నక్షత్రపు తాబేలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..

ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి మద్దతు..

For More AP News and Telugu News

Updated at - Apr 25 , 2025 | 01:28 PM