పంచకట్టులో అదిరిపోయిన బాలయ్య..

ABN, Publish Date - Apr 28 , 2025 | 08:56 PM

పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు అవార్డులు అందుకున్నారు.

ఢిల్లీ: పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి పద్మ విభూషణ్‌, నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ అందుకోగా.. మందకృష్ణ మాదిగ, కేఎల్‌ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ తెలుగు సంప్రదాయ దుస్తులు పంచకట్టు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated at - Apr 28 , 2025 | 11:32 PM