అభివృద్ధికి చంద్రబాబే నిదర్శనం: నందమూరి సుహాసిని
ABN, Publish Date - Apr 20 , 2025 | 09:22 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని తెలంగాణ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాసిని అన్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని తెలంగాణ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాసిని అన్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మణికొండలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి సుహాసిని, మాజీ ఎంపీ మురళీ మోహన్, నందమూరి రామకృష్ణ, సినిమా ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా విజన్-2020తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అభివృద్ధి చేశారని సుహాసిని కొనియాడారు. అలాగే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో పెట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు విజన్-2047తో ఆయన ముందుకు వచ్చారని, రానున్న రోజుల్లో అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తుందని సుహాసిని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి..
Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం
Updated at - Apr 28 , 2025 | 11:03 PM