దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.!
ABN, Publish Date - Nov 16 , 2025 | 09:29 PM
పాలకొండలో కొలువైన శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారి కోట దుర్గ అమ్మవారిని సూర్య కిరణాలు తాకాయి.
పార్వతీపురం జిల్లా: పాలకొండలో కొలువైన శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారి కోట దుర్గ అమ్మవారిని సూర్య కిరణాలు తాకాయి. ఆలయ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని ఇది రాష్ట్రానికి, పాలకొండ గ్రామానికి శుభ పరిణామమని అర్చకులు చెబుతున్నారు. తొలిసారిగా అమ్మవారి విగ్రహాన్ని సూర్య కిరణాలు స్పృశించడంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. దీంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సూర్య కిరణాలు అమ్మవారిని తాకటంతో ఆదివారం కోట దుర్గమ్మ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంటుంది. భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Father Attack on Children: దారుణం.. వికలాంగులని పిల్లలను చంపేసిన తండ్రి..
Caste-based Violence: దారుణం.. తన కుమార్తెకు పెళ్లి చేశాడని..
Updated at - Nov 16 , 2025 | 09:39 PM