అఘోరీ ఎఫెక్ట్.. పూజారి‌పై సస్పెన్షన్‌ వేటు

ABN, Publish Date - Apr 25 , 2025 | 01:58 PM

అఘోరికి తన ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేసిన జోగులాంబ ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద శర్మను అధికారులు సస్సెండ్ చేశారు. పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఆనంద శర్మపై వేటు వేశారు.

అలంపూర్: జోగులాంబ ఆలయ (Jogulamba temple) ఉప ప్రధాన అర్చకుడు (priest) ఆనంద శర్మ (Anand Sharma)ను సస్సెండ్ (Suspend) చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అర్చకుడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయశాఖ విజిలెన్స్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. విధి నిర్వహణలో పలు నిర్లక్ష్యం, పలు ఇతర ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ విచారణ చేపట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అర్చకుడి వద్ద ఉన్న ఆభరణాలు, అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్చకుడు అఘోరి నాగసాధువును తన ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే సయితం పలు ఆరోపణలు చేశారు. అన్ని ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులు అర్చకుడు ఆనంద శర్మపై వేటు వేశారు.

Also Read..: అఘోరికి ఖైదీ నెంబర్ 12121


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ యంత్రం ఇంట్లో పెట్టుకున్నారంటే...

రెండవ రోజు కొనసాగుతున్న AI వర్క్‌షాప్..

కేంద్రం కీలక చర్యలు.. సీమా హైదర్ పరిస్థితేంటి..

For More AP News and Telugu News

Updated at - Apr 25 , 2025 | 01:58 PM