Woman Elopes With Lover: ఇన్‌స్టా లవ్.. కొడుకును బస్టాండ్‌లో వదిలేసి ప్రియుడితో పరార్..
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:44 PM
Woman Elopes With Lover: ఆమె తన కొడుకును బస్టాండ్‌లోనే వదిలేసి బయటకు వెళ్లిపోయింది. బయట వేచి ఉన్న ప్రియుడితో పాటు బైకుపై జంప్ అయింది. పాపం పిల్లాడు.. తల్లి కోసం విలవిల్లాడాడు.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ప్రేమలు వికసిస్తున్నాయి. పెళ్లయిన వారు కూడా తప్పుదోవ పడుతున్నారు. తాజాగా, నల్గొండ జిల్లాలో మనసు కలిచి వేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన ప్రియుడి కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. కొడుకును బస్టాండ్‌లో ఒంటరిగా వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది.
దాదాపు రెండు సంవత్సరాల ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే, కొన్ని నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆమెను తన వెంట వచ్చేయమని ప్రియుడు గత కొంతకాలం నుంచి అడుగుతూనే ఉన్నాడు. గత రెండు మూడు రోజుల నుంచి అతడి వేధింపులు ఎక్కవయ్యాయి. ఆమె అతడి మాటను కాదనలేకపోయింది. ఇంటినుంచి కొడుకుతో పాటు నల్గొండ బస్టాండ్‌కు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ప్రియుడు కూడా అక్కడికి చేరుకున్నాడు.
ప్రియుడు అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె తన కొడుకును బస్టాండ్‌లోనే వదిలేసి బయటకు వెళ్లిపోయింది. బయట వేచి ఉన్న ప్రియుడితో పాటు బైకుపై జంప్ అయింది. పాపం పిల్లాడు.. తల్లి ఎంతకీ తిరిగి రాకపోవటంతో పిల్లాడు భయపడ్డాడు. అటు, ఇటు తిరగటం మొదలెట్టాడు. బాలుడ్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది సీసీటీవీ కెమెరాల ఆధారంగా తల్లి ఆనవాళ్లు గుర్తించారు. తర్వాత ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. బిడ్డను పోలీసులకు అప్పగించారు. ఇక, సీసీటీవీ ఫుటేజీల్లో ఆ మహిళ ప్రియుడితో వెళ్లిపోతున్న దృశ్యాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
నెటిజన్‌కు అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
ఎంతకు తెగించార్రా.. ఆడాళ్ల స్కీమ్‌లో మగాళ్లు..