Share News

Secretariat Infrastructure Issues: అనగనగా.. ఓ బకెట్‌!!

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:54 AM

ఈ కారిడార్‌ ఏంటి? అక్కడ ఆ బకెట్‌ ఏంటి? అని చూస్తున్నారా? ఇది అల్లాటప్పా బకెట్‌ కాదండోయ్‌.

Secretariat Infrastructure Issues: అనగనగా.. ఓ బకెట్‌!!

ఈ కారిడార్‌ ఏంటి? అక్కడ ఆ బకెట్‌ ఏంటి? అని చూస్తున్నారా? ఇది అల్లాటప్పా బకెట్‌ కాదండోయ్‌. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయంలోని బకెట్‌ ఇది. వర్షానికి కారుతున్న నీటిని ఒడిసి పట్టేందుకు అక్కడ పెట్టారు. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలోని ఈ విచిత్రం ‘ఆంధ్రజ్యోతి’ కెమెరాకు చిక్కింది. మూడో అంతస్తులోని 32వ నంబరు గది ముందు సీసీ కెమెరా పక్క నుంచి కారుతున్న నీటిని ఒడిసి పట్టేందుకు ఇలా బకెట్‌ ఏర్పాటు చేశారు. సచివాలయంలో డిజైన్ల కోసం అమర్చిన జీఆర్‌సీ ఫ్రేములు పలుచోట్ల ఊడిపడుతుండగా.. ఇప్పుడు వర్షానికి నీళ్లు కారడం విస్మయానికి గురి చేస్తోంది.

Updated Date - Jul 28 , 2025 | 03:54 AM