Share News

Jayasimha Reddy: రైతులకు సేవ చేసేందుకే..

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:03 AM

ఆచార్య జయశంకర్‌ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్త అయిన రావుల ఉమారెడ్డి కుమారుడు.. రావుల జయసింహారెడ్డి సివిల్స్‌లో 46వ ర్యాంకు సాధించారు.

Jayasimha Reddy: రైతులకు సేవ చేసేందుకే..

  • 46వ ర్యాంకర్‌ రావుల జయసింహారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆచార్య జయశంకర్‌ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్త అయిన రావుల ఉమారెడ్డి కుమారుడు.. రావుల జయసింహారెడ్డి సివిల్స్‌లో 46వ ర్యాంకు సాధించారు. వరంగల్‌కు చెందిన జయసింహారెడ్డికి.. చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద ఆసక్తి. తన తండ్రిని కలిసేందుకు రైతులు వచ్చేవారని.. వారికి సేవ చేసేందుకే తాను సివిల్స్‌ రాశానని ఆయన తెలిపారు. ‘‘హైదరాబాద్‌ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. 2019లో గ్రాడ్యుయేషన్‌ పూర్తయింది.


అప్పటి నుంచీ సివిల్స్‌ రాయడం మొదలు పెట్టాను. మొదటి రెండు విడతల్లో రాలేదు. మూడో విడతలో ఐపీఎస్‌ వచ్చింది. ప్రస్తుతం శిక్షణలో ఉన్నాను.. నాలుగో విడత రాస్తే 104వ ర్యాంకు వచ్చి మళ్లీ ఐపీఎస్‌ వచ్చింది. నాకు ఐపీఎస్‌ ఇష్టమే అయినా.. పేదలకు సేవ చేయడానికి ఐఏఎస్‌ అయితే బాగుంటుందని ఐదోసారి మళ్లీ ప్రయత్నం చేశా. ఇప్పుడు 46వ ర్యాంకు వచ్చింది’’ అని జయసింహారెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రొత్సాహంతోనే తాను ఈ ర్యాంకు సాధించగలిగానన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 04:03 AM