Maoist Letter: కర్రెగుట్టల ఆపరేషన్‌ను నిలిపేయండి.. మావోల లేఖ
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:14 PM
Maoist Letter: కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కరెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై వెంటనే ఆపేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్‌నోట్ విడుదల అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని లేఖలో మావోలు వినతి చేశారు. తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని మావోయిస్టులు కోరారు.
కాగా.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలో కూడా రెండు రెండు, మూడు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలని ఆపరేషన్స్‌ను వెంటనే నిలిపివేయాలని లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు ముందుకు రావాలని వినతి చేస్తూ మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. మావోయిస్టు బస్తర్ ఇన్‌చార్జ్ రూపేష్ పేరుతోనే ఈ ప్రకటన విడుదలైంది. అయితే ఈ లేఖపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎండ ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ కగార్ ఇబ్బంది ఏర్పడింది. దాదాపు 30 నుంచి 40 మంది జవాన్లు డిహైడ్రేట్ అయి స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మరి మావోయిస్టు పార్టీ కోరిన విధంగా శాంతి చర్చలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది.
మావయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కర్రగుట్టలు కొనసాగుతోంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో మావోయిస్టు టాప్ సుప్రీం కమాండర్ హిడ్మా టార్గెట్‌గా గత మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. ఈ కూంబింగ్‌లో మొత్తం 10 వేల మంది భద్రతా బలగాలు పాల్గొన్నాయి. కర్రెగుట్టల్లో హిడ్మా, తెలంగాణకు చెందిన దామోదర్‌తో పాటు మూడువేలకు పైగా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ క్రమంలో గత మూడు రోజులుగా కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వైమానిక డ్రోన్ల సాయంతో మావోయిస్టులను తుదముట్టించేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అడుగడున ఉన్న ఐఈడీ బాంబులను డిస్పోజ్ చేస్తూ చాలా సాహసోపేతంగా ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టల చుట్టూ వేలాది మంది భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో వందల మంది మావోయిస్టుల చనిపోయే అవకాశం ఉందని పౌరహక్కు సంఘాలు ఆందోళనకు చేస్తున్నాయి. తక్షణమే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పౌరహక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్
Sikkim: సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు..
Read Latest Telangana News And Telugu News