Vivek Venkataswamy: దళితుల రిజర్వేషన్లు 18శాతానికి పెంచేలా కృషి
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:03 AM
ఎస్సీ వర్గీకరణలోని రోస్టర్ విధానం వల్ల మాలలకు జరుగుతున్న నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

మాల మహానాడులో మంత్రి వివేక్
ఖైరతాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణలోని రోస్టర్ విధానం వల్ల మాలలకు జరుగుతున్న నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఖైరతాబాద్ వాసవి క్లబ్‌లో శుక్రవారం జరిగిన మాల మహానాడు నాయకుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. దళితుల రిజర్వేషన్లు 18శాతానికి పెంచేలా తన వంతు కృషి చేస్తానన్నారు.
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడుతూ వర్గీకరణతో మాల విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ విధానాన్ని సరిచేయాలని, దళితులకు 18శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలని, రోస్టర్ విధానాల్లో జరిగిన అన్యాయాలపై 28న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.