Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో కుటుంబం కుల బహిష్కరణ
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:06 AM
భూ వివాదం విషయంలో పంచాయితీ చేసిన కుల పెద్దలు గ్రామంలోని ఓ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు.

భూ కబ్జా పంచాయితీలో కుల పెద్దల దాష్టీకం
టేకులపల్లి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): భూ వివాదం విషయంలో పంచాయితీ చేసిన కుల పెద్దలు గ్రామంలోని ఓ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడులో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పూనెం రామస్వామి, ఆయన భార్య వెంకటరమణను కులం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆదివారం రాత్రి గ్రామంలో చాటింపు వేశారు. దీంతో రామస్వామి, ఆయన భార్య వెంకటరమణ సోమవారం టేకులపల్లి పోలీసులను ఆశ్రయించారు. గ్రామంలోని తమకు చెందిన ఆర్వోఎ్‌ఫఆర్ పట్టా భూమిని కొడెం ముత్తయ్య, ఆయన కుమారులు మోహన్, సునీల్ దౌర్జన్యంగా ఆక్రమించుకుని వ్యవసాయ బోరు వేసుకున్నారని బాధితులు ఆరోపించారు.
దీనిపై పంచాయితీలు జరుగుతుండగా.. పెద్దమనుషులు ముత్తయ్యకు వత్తాసు పలుకుతూ తమ కుటుంబాన్ని బహిష్కరించారని తెలిపారు. దీంతో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ సురేశ్, ఎస్‌ఐ రాజేందర్ రోళ్లపాడు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. గ్రామంలో కుల బహిష్కరణలు చేయడం నేరమని, అలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News