Rajarajeshwara Temple: వేములవాడలో తాత్కాలిక దర్శనాలు ఎలా?
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:24 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. ఆ పనులను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది.

భీమన్న గుడి అనువేనా? కాదా?
ఎల్లుండి ఉన్నతాధికారుల పరిశీలన
వేములవాడ కల్చరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. ఆ పనులను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భక్తులకు తాత్కాలిక దర్శన ఏర్పాట్లను ఎక్కడ చేయాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో భీమేశ్వరస్వామి గుడిలో దర్శనాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై యోచిస్తోంది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మంగళవారం క్షేత్రంలో పర్యటించనున్నారు.
అభిషేక పూజల మండ పం, నిత్య కల్యాణ మండపం వంటి వాటికి షెడ్ల నిర్మాణాలు ఎటువైపు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విషయంలో పరిశీలన చేయనున్నారు. ఒకవేళ భీమేశ్వరాలయం దర్శనాలకు అనువుగా లేకపోతే అందుబాటులోనే మరో చోటును చూడనున్నారు. కాగా, అభివృద్ధి పను లు ప్రారంభమైనా రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని మూలవిరాట్టుకు జరిగే నిత్య పూజ ల్లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతించరు.