Uttam: ఎన్‌డీఎస్‌ఏ నివేదికతో ప్రజల ముందు దోషిగా బీఆర్‌ఎస్!
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:14 AM
కాళేశ్వరం లోపాల విషయంలో ఎన్‌డీఎ్‌సఏ నివేదిక బీఆర్‌ఎ్‌సను ప్రజల ముందు దోషిగా నిలబెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర రైతులకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి
ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు
నిరుపయోగమని ఎన్‌డీఎస్‌ఏ తేల్చింది
నిర్మాణంలో లోపాలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం లోపాల విషయంలో ఎన్‌డీఎ్‌సఏ నివేదిక బీఆర్‌ఎ్‌సను ప్రజల ముందు దోషిగా నిలబెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు నిరుపయోగమని నివేదిక తేల్చిందని చెప్పారు. వాటిని కట్టించిన బీఆర్‌ఎస్ నేతలు తమ గొప్పతనంగా చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వాళ్లు తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణాన్ని బీఆర్‌ఎస్ చేపట్టిందని, నిర్మాణం ఆ పార్టీ అధికారంలో ఉండగానే జరిగిందని, బ్యారేజీలు కుంగింది కూడా ఆ పార్టీ అధికారంలో ఉండగానే అని గుర్తుచేశారు.
ఎన్‌డీఎ్‌సఏ నివేదికపై శుక్రవారం ఆయన స్పందించారు. రూ.లక్ష కోట్లను అధిక వడ్డీకి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అధోగతి పాలు చేసిందన్నారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదికపై సమగ్ర అధ్యయనం చేసి, మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రాజెక్టును నాటి అధికార పార్టీ నేతల జేబులు నింపుకోవడానికే వినియోగించుకున్నారని మండిపడ్డారు. నిర్మాణంలో లోపాలను గుర్తించి, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు బ్యారేజీలు నిరుపయోగంగా మారినా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.