Share News

Urea Supply: గతేడాదికంటే 18% ఎక్కువ యూరియా

ABN , Publish Date - Jul 23 , 2025 | 06:39 AM

గతేడాదితో పోలిస్తే ఈ వానాకాలం సీజన్‌లో 18 శాతం ఎక్కువ యూరియాను సరఫరా చేసినట్లు రాష్ట్ర సహకారశాఖ కార్యదర్శి

Urea Supply: గతేడాదికంటే 18% ఎక్కువ యూరియా

  • అక్రమ మళ్లింపుపై దృష్టి పెట్టాలి

  • రాష్ట్ర సహకారశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌

హైదరాబాద్‌, జులై 22 (ఆంధ్రజ్యోతి): గతేడాదితో పోలిస్తే ఈ వానాకాలం సీజన్‌లో 18 శాతం ఎక్కువ యూరియాను సరఫరా చేసినట్లు రాష్ట్ర సహకారశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపితో కలిసి మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొన్ని యూనిట్లు యూరియాను వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మళ్లించే అవకాశం ఉందని, అలాంటి యూనిట్లను తనిఖీ చేయాలని క్షేత్రస్థాయి అధికారులను సురేంద్రమోహన్‌ ఆదేశించారు. బ్లాక్‌ మార్కెట్‌ లేదా మళ్లింపులకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌ (8977741771)కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు. రైతులకు సకాలంలో యూరియా అందేలా చూడాలని, ఇందుకోసం వ్యవసాయ, సహకార శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఉదయం 8 గంటలకే తెరిచి ఉంచాలన్నారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియా పూర్తిస్థాయిలో సరఫరా అయ్యేలా చూసేందుకు, వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి శివశంకర్‌ బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 06:39 AM