Share News

Ugadi: ఒమాన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:47 AM

ఒమాన్‌ దేశంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలుగు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆధ్యాత్మికత వాతావరణంలో శోభాయమానంగా నిర్వహించారు.

Ugadi: ఒమాన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

  • సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా నిర్వహణ

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ఒమాన్‌ దేశంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలుగు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆధ్యాత్మికత వాతావరణంలో శోభాయమానంగా నిర్వహించారు. ఒమాన్‌ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో మస్కట్‌ నగరంలో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌ చైర్మన్‌ పి.బాబు రాజేంద్రన్‌, ప్రధాన కార్యదర్శి షకీల్‌ కొమ్మత్‌ జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ వేడుకకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సంప్రదాయ వస్త్రధారణతో వందలాది మంది హాజరుకావడంతో తెలుగతనం వెల్లివిరిసింది.


ఒమాన్‌ తెలంగాణ సమితి కన్వీనర్‌ గుండేటి గణేశ్‌, కో కన్వీనర్‌ నూనె లక్ష్మణ్‌ నేతృత్వంలో వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలతో ఉగాది సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మస్కట్‌లోని ప్రముఖ వేద పండితులు, సిద్ధాంతి విజయ పంచాంగ పఠనం చేశారు. కుల, మత, ప్రాంతీయ వివక్షకు తావులేకుండా తెలుగువారందరిని కలుపుకుంటూ, అందరి సమన్వయంతో ఒమాన్‌ తెలంగాణ సమితి పని చేస్తోందని గణేష్‌, లక్ష్మణ్‌ తెలిపారు.

Updated Date - Apr 06 , 2025 | 03:47 AM