Share News

Aadhar Number: ఇద్దరు పిల్లలకు ఒకే ఆధార్‌ నంబర్‌

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:29 AM

వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్‌లోని రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు బాలురకు ఒకే ఆధార్‌ నంబర్‌ వచ్చింది.

Aadhar Number: ఇద్దరు పిల్లలకు ఒకే ఆధార్‌ నంబర్‌

  • రెండు కుటుంబాలకు ఇక్కట్లు

  • వరంగల్‌ జిల్లా గుండ్లపహాడ్‌లో ఘటన

నల్లబెల్లి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్‌లోని రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు బాలురకు ఒకే ఆధార్‌ నంబర్‌ వచ్చింది. దీంతో ఆ బాలుర కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. గుండ్లపహాడ్‌ గ్రామానికి చెందిన మనుబోతుల సుమన్‌ కుమారుడు ధనుష్‌, కత్తెరపెల్లి బాబు కుమారుడు శివకు ఒకే ఆధార్‌ నంబర్‌ (3996 7128 3843) జారీ అయింది. ప్రస్తుతం ధనుష్‌ 4వ తరగతి, శివ 5వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో చేర్పించేటప్పుడు ఇద్దరి ఆధార్‌ నంబర్లు ఒకటే అన్న విషయం వెలుగులోకి వచ్చింది.


ఈ విషయమై అధికారులకు, ఆధార్‌ సెంటర్లకు ఫిర్యాదు చేసినా.. పరిష్కారం లభించలేదు. అయితే, ఇద్దరి ఆధార్‌ కార్డులకు సంబంధించిన ఓటీపీలు కత్తెరపెల్లి బాబు ఫోన్‌ నంబర్‌కు వస్తున్నాయి. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఇద్దరికీ వేర్వేరు ఆధార్‌ నెంబర్‌లను కేటాయించాలని రెండు కుటుంబాలు కోరుతున్నాయి.

Updated Date - Aug 02 , 2025 | 08:29 AM